న్యూ శక్తి దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో.. ప్రపంచ వికలాంగుల దినోత్సవం
హాజరైన వందలాది మంది దివ్యాంగులు
తల్లి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం
ఐడియల్ కుకట్ పల్లి చెరువు దగ్గర న్యూ శక్తి దివ్యాంగుల సంస్థ అధినేతలైన వెంకటస్వామి చిరంజీవి ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది దివ్యాంగులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మునిపల్లి గ్రామం
చెందిన పెద్దగొల్ల పార్వతమ్మ ఈ మధ్యనే అకాల మరణం చెందారు. వారి ఆత్మ శాంతించాలని వారి జ్ఞాపకార్థంగా వారి కుమారులైన పెద్దగొల్ల నాగరాజు, నరసింహులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ న్యూ శక్తి దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా తమతల్లి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం న్యూ శక్తి దివ్యాంగుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.

