భారత్‌పై ట్రంప్ ప్రభావం-ఫ్యూచర్ ప్లాన్
ఇండియాను బిజెనెస్ మార్కెట్‌గా చూస్తోన్న ట్రంప్
భారత ప్రభుత్వం మేలుకోవాలంటున్న ఆర్థిక నిపుణులు
NAIDI MAHIPAL REDDY, SENIOR JOURNALIST
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభావం ఏంటి..? భారతీయులపై ట్రంప్ ఎందుకింత కక్ష కట్టాడు..?
భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయడమే ట్రంప్ లక్ష్యమా..?
గోల్డ్ కార్డ్ ప్రీమియం వీసా సిస్టం తీసుకురావడం వెనుక ఉన్న ట్రంప్ ఉద్దేశ్యం ఇదేనా..?

ట్రంప్…ట్రంప్…ట్రంప్…ఇప్పుడు భారతీయులు కలువరిస్తున్న పేరు. ప్రేమతో కాదు…కోపంతో ట్రంప్ పేరును కలవరిస్తున్నారు భారతీయులు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు.
డోనాల్డ్ ట్రంప్ రెండోసారి పాలన చేపట్టిన తర్వాత అమెరికా-భారత్ సంబంధాలు రోజురోజుకు పలుచబడుతున్నాయని చెప్పవచ్చు. ఇందుకు ట్రంప్ బిజినెస్ మైండ్ సెట్ ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు.
అన్ని రంగాల్లో తానే ముందు ఉండాలన్న లక్ష్యంతో ట్రంప్ అనుసరిస్తున్న అమెరికా ఫస్ట్ (America First) విధానం అతని దురుద్దేశాన్ని చెప్పకనే చెబుతోంది. భారత దేశంతో మంచి సంబంధాల కంటే అమెరికా కేవలం వ్యాపార సంబంధాన్ని మాత్రమే కోరుకుంటోందని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
అమెరికా అధ్యక్షుడిగా భారత్ విషయంలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలన్నీ…వ్యాపార కోణంలోనే అమెరికాకు లాభాలను తెచ్చిపెట్టేవిగా ఉన్నాయి. వీసా ఫీజుల పెంపు అనేది ముఖ్యంగా భారతీయులను దృష్టిలో ఉంచుకుని తీసుకు వచ్చిన సంస్కరణగా చెప్పుకోవచ్చు. అమెరికా ప్రభుత్వం వీసాలపై మరీ ఎక్కువగా ఫీజులను పెంచింది.
అమెరికాలో ఇప్పటికే టూరిస్ట్ వీసాల (B1/B2) ఫీజులు పెరిగాయి. భారత టూరిస్టులు, ఉద్యోగులే లక్ష్యంగా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల ప్రాసెంగ్ ఛార్జీలు వీపరీతంగా పెంచారు. ఇది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అలాగే గోల్డ్ కార్డ్ ప్రీమియం వీసా సిస్టమ్ ప్రాసెసింగ్ కోసం అధిక ఫీజులు వసూలు చెయ్యడం చూస్తే…అమెరికా ఎంతలా వ్యాపారాత్మకంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులకు సంబంధించిన F-1 వీసాల విషయంలో నిబంధనలు కఠినం చెయ్యడం, అదనపు సెక్యూరిటీ చెక్‌లు, DS-160 ఫీజుల పెంపు భారంగా మారింది.
అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారత విద్యార్థుల పాత్ర ఎక్కువ. అందుకే అమెరికా ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ నిర్ణాయలు తీసుకున్నట్టు తెలుస్తోంది. భారతీయులపై ఎక్కువ భారం మోపి వ్యాపరం చెయ్యాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్టు అర్థమవుతోంది.
తాజా పరిణామాలు చూస్తే…ఐటీ రంగంలో వీసా లిమిట్స్, దిగుమతులపై భారీ ట్యాక్స్‌లు విధించడం…అన్నీ కూడా అమెరికా ఆర్థిక ప్రయోజనాల కోసమే ట్రంప్ అమలు చేస్తున్నట్టు అవగతమవుతోంది. భారత్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కేవలం పెద్ద బిజినెస్ మార్కెట్‌గా మాత్రమే చూస్తున్నట్టు తేటతెల్లమవుతోంది.

ఈ పరిస్థితిని అధిగమించాలంటే…భారత ప్రభుత్వం ఇప్పటి నుంచే సరైన చర్యలు తీసుకోవాలి. దేశీయంగా ఐటీ అభివృద్ధికి మరింత కట్టుదిట్టమైన ప్లానింగ్ చెయ్యాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. భారత ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


