రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
-తిరుపతి జిల్లా పోలీస్ శాఖ
ప్రమాదాల నివారణకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రయత్నాలు
ప్రమాదాలను నివారించడమే లక్ష్యమంటున్న జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
చిన్న జాగ్రత్త – పెద్ద ప్రమాదాన్ని నివారిస్తుంది.
మా లక్ష్యం జరిమానాలు విధించడం కాదు – ప్రమాదాలు నివారించడం.
రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించి, రోడ్డు ప్రమాదాల నివారణలో పోలీసు శాఖకు సహకరించండి.
హెల్మెట్ మా భద్రత కోసం కాదు – మీకు మరియు మీ కుటుంబ సభ్యుల కోసం.
తిరుపతి జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్.
ఇటీవలి కాలంలో తిరుపతి జిల్లా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషించినప్పుడు, ద్విచక్రవాహనదారులు ఎక్కువగా గాయపడడం లేదా మరణించడం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని, తిరుపతి జిల్లా పోలీసు శాఖ గత 15 రోజులుగా మూడంచెల ప్రత్యేక చర్యల ప్రణాళిక (Education, Engineering & Enforcement) ను అమల్లోకి తీసుకువచ్చింది.
Education (అవగాహన కార్యక్రమాలు)
ద్విచక్రవాహన దారులకు హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, ప్రమాదాల నివారణ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాము.
స్కూళ్లు, కళాశాలలు, ఫ్యాక్టరీలు, టోల్ గేట్లు మరియు పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
Wrong Route లో ప్రయాణించడం వలన కలిగే ప్రాణాపాయ పరిస్థితులపై విభిన్న స్థాయిలో చైతన్యం కల్పించడం జరుగుతోంది.
Engineering (మౌలిక వసతుల మెరుగుదల)
జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర, IAS ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన తగు ప్రణాళికలు రూపొందించారు.
ప్రతి పోలీస్ స్టేషన్, సబ్-డివిజన్ పరిధిలో ట్రాన్స్పోర్ట్ శాఖ, నేషనల్ హైవే, స్టేట్ హైవే అధికారులు ఇతర శాఖలతో కలిసి ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను స్వయంగా పరిశీలించి, అవసరమైన జాగ్రతలు తీసుకుకొవాలని సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది.
ముఖ్య ప్రదేశాలలో Barricades, Hoardings, Warning Signages వంటి రోడ్డు భద్రతా సూచికలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Enforcement (చట్టపరమైన చర్యలు)
సెంబర్ 15వ తేదీ నుంచి తిరుపతి జిల్లా పరిధిలో “No Helmet – No Petrol” నిబంధన కఠినంగా అమలులోకి వస్తుంది.
హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
ఇటీవల జరిగిన ప్రమాదాల పరిశీలనలో Wrong Route ద్వారా ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరిగుతున్నట్లు స్పష్టమైంది.
కాబట్టి Wrong Route లో ప్రయాణించే వాహనదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ప్రాణాలకు మించినది ఏదీ లేదు. చిన్న జాగ్రత్త, ఒక హెల్మెట్ – ఒక కుటుంబాన్ని కాపాడగలదు.
తిరుపతి జిల్లా పోలీసులు ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.

