– శ్రీ జోగులాంబ అమ్మవారి దేవాలయాలలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
– శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామివారికీ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.
– ఆలయ మండపంలో గవర్నర్ కు పట్టు వస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం,తీర్థ ప్రసాదాలను అందచేత.
అక్షరగళం , మంగళవారం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు.

ఈ సందర్భంగా శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి మరియు శ్రీ జోగులాంబ అమ్మవారి దేవాలయాలలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ముందుగా దేవాలయ వేద పండితులు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సంప్రదాయాల వాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.అనంతరం శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుని అభిషేకాలు,ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ కూడా చేశారు.

తదనంతరం శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని, అమ్మవారికి విశిష్ట పూజలు అర్పించారు.వేద పండితులు ఆలయ మండపంలో గవర్నర్ కు పట్టు వస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం,తీర్థ ప్రసాదాలను అందించారు.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, దేవాదాయ శాఖ కమిషనర్ డా.ఎస్.హరీష్,ఐ.ఏ.ఎస్.జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్,ఎస్పీ శ్రీనివాస రావు,అలంపూర్ శాసన సభ్యులు విజయుడు,రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి,గవర్నర్ సంయుక్త కార్యదర్శి జె.భవానీ శంకర్, గవర్నర్ ఏడీసీ మేజర్ అమన్ కుందూ,గవర్నర్ ఏడీసీ కాంతిలాల్ పటేల్,ఐ.పి.ఎస్, గవర్నర్ సీఎస్‌ఓ ఎల్.శ్రీనివాస రావు,గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి పవన్ సింగ్, డిఎస్పీ మొగలయ్య, పురావస్తు శాఖ ఇంజనీర్ కిశోర్ కుమార్ రెడ్డి,ఆర్డీవో అలివేలు, ఈ.ఓ దీప్తి,తహసీల్దార్ మంజుల, హార్టికల్చర్ అసిస్టెంట్ వేణు, తదితరులు పాల్గొన్నారు.


