Wednesday, January 14, 2026
No menu items!
Advertisement
హోమ్ఆంధ్ర ప్రదేశ్టెక్నాల‌జీ సాయంతో భ‌ద్ర‌త ప‌ర్యావేక్ష‌ణ‌

టెక్నాల‌జీ సాయంతో భ‌ద్ర‌త ప‌ర్యావేక్ష‌ణ‌

టెక్నాల‌జీ సాయంతో భ‌ద్ర‌త ప‌ర్యావేక్ష‌ణ‌
-ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్

సాంకేతికతనే ఆయుధంగా చేసుకుని పర్యవేక్షిస్తున్న నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.

ఏ.ఐ.డ్రోన్ మరియు సి.సి.కెమెరాల ద్వారా భవానిల రద్దీ పరిశీలన

ఫేసియల్ రికగ్నైజెషన్ కెమెరాల ద్వారా పాత నేరస్థుల కదలికలపై నిఘా

భవాని దీక్షల విరమణ కార్యక్రమ నేపథ్యంలో పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతికతను ఆయుధంగా చేసుకుని పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమీషనర్ ఇతర పోలీస్ అధికారులతో కలిసి భవానీ దీక్షా విరమణ బందోబస్త్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. మోడల్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం నుండి సి.సి.కెమెరాల ద్వారా స్నాన ఘాట్ లను, క్యూలైన్స్, పార్కింగ్ ప్రదేశాలను, కేశఖండన శాల, హోల్డింగ్ ఏరియాలను పరిశీలించి బందోబస్త్ సిబ్బందికి తగు సూచనలు చేశారు.

ట్రాఫిక్ పరంగా ఎక్కడా అవంతరాలు ఏర్పడకుండా అస్త్రం యాప్ ద్వారా పర్యవేక్షిస్తూ భవానీలు వారి వాహనాలను నిర్ణిత ప్రదేశాలాలో పార్కింగ్ చేసుకునే విధంగా ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ పర్యవెక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ డి.సి.పి.గారికి పలు సూచనలు చేశారు.

అదేవిధంగా ఏ.ఐ. డ్రో న్ కెమెరాల ద్వారా గిరిప్రదక్షణ ఏరియాలలొని రద్దీని పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఫేసియల్ రికగ్నైజెషన్ కెమెరాల ద్వారా టెంపుల్ పరిసర ప్రాంతాలలో పాత నేరస్థుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసి పాత నేరస్థులను గుర్తించిన వెంటనే కంట్రోల్ రూం నుండి ఆ ఏరియాలోని క్రైమ్ సిబ్బందికి ఫోటోలను పంపి సదరు వ్యక్తులను అదుపులోనికి విచారించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది.

భవానీ భక్తుల దర్శనము ఎంత సమయం పడుతుంది అనే విషయం ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా చర్యలు చేపట్టాలని సచివాలయ మహిళా పోలీస్ వారికి పలు సూచనలు చేశారు.

అనంతరం హోమగుండాలను, విరుముడి స్టాల్స్ మరియు ప్రసాదం కౌంటర్లను పరిశీలిస్తూ అధికారులను మరియు సిబ్బందిని తగు సూచనలిస్తూ అప్రమత్తం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., , డి.సి.పి.లు లక్ష్మి నారాయణ ఐ. పి. ఎస్. , శ్రీమతి షిరీన్ బేగం ఐ.పి.ఎస్. , శ్రీమతి కృష్ణ ప్రసన్న ఐ.పి.ఎస్. ఆనంద్ బాబు , ఇన్ ఛార్జ్ కలెక్టర్ ఇలాక్కియా ఐ.ఏ.ఎస్., ఇతర అధికారులు, ఇన్స్పెక్టర్లు, ఎస్. ఐ.లు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments