– తొలి అంతర్జాతీయ శతకంతో చిరస్థాయి రికార్డు
– దక్షిణాఫ్రికా వేదికగా టీమిండియా ఓడినా… రుతురాజ్ సెంచరీ మాత్రం ఓ చరిత్ర
అక్షరగళం: టీమిండియా యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో అరుదైన ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికా ముందు భారత్ పెట్టిన భారీ టోటల్ వృథా అయినప్పటికీ… రుతురాజ్ సెంచరీ మాత్రం ఎవ్వరూ చెరిపేసుకోలేని రికార్డుగా మారింది.358 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ సౌతాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ (105) మరియు విరాట్ కోహ్లీ చేసిన సెంచరీలు టీమిండియా విజయానికి దోహదపడకపోయినా, రుతురాజ్ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. సౌతాఫ్రికా తరఫున ఎడెన్ మార్క్రమ్ 105 పరుగులతో జట్టును విజయపథంలో నడిపాడు. మొదటి వన్డేలో కేవలం ఎనిమిది పరుగులకే ఔటై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రుతురాజ్‌పై రెండో వన్డేకు ముందు ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. అయితే, టీమిండియా మేనేజ్‌మెంట్ అతనిపై నమ్మకం ఉంచి మరో అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని రుతురాజ్ అద్భుతంగా వినియోగించుకున్నాడు.
ఫస్ట్ సెంచరీ
ఇక రుతురాజ్ వన్డేల్లో తన తొలి సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. 83 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 105 పరుగులు సాధించి ఔటయ్యాడు. ఈ శతకంతో రాయ్‌పూర్ వేదికపై మొట్టమొదటి అంతర్జాతీయ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ చేసిన 51 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. కానీ రుతురాజ్ సెంచరీతో ఆ రికార్డు కూడా చెరిపోయింది. అదే కాదు… దక్షిణాఫ్రికాపై వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్‌గా కూడా రుతురాజ్ అరుదైన కీర్తి దక్కించుకున్నాడు. తొలి మ్యాచ్‌లో నిరాశ, రెండో మ్యాచ్‌లో చరిత్ర — ఈ రెండు అంచుల్లో రుతురాజ్ ప్రయాణం భారత క్రికెట్‌కు కొత్త ఆశ చూపుతోంది.

