– కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
అక్షరగళం, శేరిలింగంపల్లి: తత్వరితంగా రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అధికారి యంత్రాంగాన్ని కోరారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని బీకే ఎన్‌క్లేవ్ కాలనీ నుంచి మియాపూర్ బొల్లారం చౌరస్తా వరకు చేపడుతున్న ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనులను ఆయన సోమవారం హెచ్‌ఎండీఏ డీఈ దీప్తి, ఏఈ అషితోష్‌లతో కలిసి రోడ్డు విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికే రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా రోడ్డు విభాగ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. పీఏసీ చైర్మన్ ఆరికపూడి గాంధీ గారి సహకారంతో మియాపూర్ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు

