Wednesday, January 14, 2026
No menu items!
Advertisement
హోమ్క్రైమ్మొదటి విడత పంచాయితీ పోలింగ్‌కు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్

మొదటి విడత పంచాయితీ పోలింగ్‌కు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్

రామగుండం, అక్ష్క్షర గళం, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యం: రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝాపోలీసుల పటిష్టమైన భద్రతతో స్వేచ్ఛ, నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ మొదటి విడత కాల్వ శ్రీరాంపూర్, కమాన్ పూర్, రామగిరి, మంథని, ముత్తారం 05 మండలాలలో 95 గ్రామపంచాయతీలు 685 పోలింగ్ కేంద్రాలలో, 135 పోలింగ్ లొకేషన్స్, మంచిర్యాల జోన్ పరిధిలో.. దండేపల్లి, జన్నారం, లక్షేట్టిపేట 04 మండలాలలో 81 గ్రామపంచాయతీలు, 514 పోలింగ్ కేంద్రాలలో,143 పోలింగ్ లొకేషన్స్.మొత్తం రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధి లో 1712 మొత్తం పోలింగ్ కేంద్రాలలో సాధారణ పోలింగ్ కేంద్రాలు- 1174, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు- 538.

ఆయన మాటల్లోనే……..

ఎన్నికల ముందు రోజు, ఎన్నికల రోజు, ఫలితాలు వెల్లడించిన తరువాత ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు, గొడవలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది.

📌. పెద్దపల్లి జోన్ పరిధిలో 04 (గోదావరి బ్రిడ్జ్ , ఎక్లాస్ పూర్, దుబ్బపల్లి ,గుంపుల ) మంచిర్యాల జోన్ పరిదిలో 05 (పారేపల్లి X రోడ్,తాండూర్ ఐబి,ఇందానపల్లి ఫారెస్ట్ చెక్ పోస్ట్,గూడెం ,ఇందారం) ల వద్ద ఏర్పాటు చేసినా చెక్ పోస్ట్ లలో నిరంతరం నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి 24 / 7వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.

📌ఎన్నికల కోడ్ అమలు చేయబడిన రోజు నుండి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో

నగదు : 03 కేసు లలో 6,84,910 లక్షలు సిజ్

లిక్కర్ సంబందించి 200 కేసు లలో 1323 లీటర్లు సిజ్ దాని విలువ 8,57,553

గంజాయి 03 కేసులు 1750 గ్రామ్స్ సిజ్, దాని విలువ 87,000

పిడియస్ రైస్ కేసు 01, 17 క్వింటాళ్లు సిజ్, దాని విలువ 30,000

మొత్తం విలువ 16,59,463

· రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరిపై పై 01 ఎన్నికల ప్రవర్తన నియమా నియమావళిని ఉల్లంఘించినటువంటి కేసుల నమోదు చేయడం జరిగింది .పోలీస్ కమీషనరేట్ పరిధిలో 35 గన్ లైసెన్లు కలిగినటువంటి 34 మంది గన్స్ డిపాజిట్ చేయడం జరిగింది. 01 ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 30 లైసెన్సులు 47 గన్స్ బ్యాంకులకు సంబంధించినవి కలవు. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డీసీపీ -02, ఏసీపీ -06, సీఐ-30,ఎస్ ఐ లు – 95, ఏఎస్ ఐ / హెడ్ కానిస్టేబుల్- 270, కానిస్టేబుల్ – 520, హోం గార్డ్స్ – 240, ఆర్మూడ సిబ్బంది – 170, QRT టీమ్స్ – 72, మిగతా సిబ్బంది -200 సుమారు 1600 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో జరగబోయే మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు విస్తృతమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు, ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కంట్రోల్ రూమ్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్, సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లు సిద్ధంగా ఉన్నాయని, పోలీస్ పికెట్‌లు, మొబైల్ ప్యాట్రోలింగ్ ఏర్పాటు చేశాం అని తెలిపారు. గుంపులుగా తిరగడం, గొడవలకు, బెదిరింపులకు, దాడులకు పాల్పడడం, డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకి పాల్పడడం నిబంధనలకు విరుద్ధం, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా, దైర్యంగా స్వేచ్చయుత వాతావరణం లో తమ ఓటు హక్కు వినియోగించుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments