*– కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద.

అక్షరగళం, కుత్బుల్లాపూర్: కోట్ల రూపాయ6ల విలువచేసే ప్రభుత్వ భూములను ఏ విధంగా కొల్లగొట్టాలి?, వాటిని ఏ విధంగా అనుచరులకు, కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలి? అనే ఏకైక ఏజెండాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని తీవ్రంగా దుయ్యబట్టారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. జిహెచ్ఎంసి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. జీవో నెంబర్ 27 తో ప్రభుత్వ భూములను అమ్మకానికి ఉంచడం అంశంపై నిరసిస్తూ ప్రభుత్వ తీరును సహజర ఎమ్మెల్యేలతో కలిసి మీడియా ముఖంగా తీవ్రంగా వ్యతిరేకించారు. గత రెండు సంవత్సరాల కాలంలో మూసి పరివాహక ప్రాంతాల్లో భూములు సేకరిస్తామని చెబుతూ చేసిన అరాచకం చూసామని, అదేవిధంగా ఎల్ అండ్ టి మెట్రో స్థలాలు దోచేయడానికి వాటిని ఏ విధంగా కొల్లగొట్టాలని ఆలోచనతో ఎల్ అండ్ టి కంపెనీని సాధనంపిన విధానం చూసామని విమర్శించారు. అత్యంత విలువైన గచ్చిబౌలి కంచ భూములను బ్యాంకుల్లో తను కాబట్టి 10 వేల కోట్లు దండుకున్నది ఎవరని ప్రశ్నించారు. భవిష్యత్తు తరాలకు ఉద్యోగ ఉపాధి కల్పనకు కేసీఆర్ ప్రభుత్వం 20,000 ఎకరాలను సేకరిస్తే దానిని రద్దుచేసి అక్కడ సైతం భూదందాలకు తెర లేపారని విమర్శించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలలోని 22 ఇండస్ట్రియల్ క్లస్టర్లలో 9292 ఎకరాలు (సుమారు 5 లక్షల కోట్ల విలువ ) గల భూములను 5000 కోట్లకు ధారాధాత్తం చేయడానికి నిర్ణయించుకొని ఈనెల 22న జీవో నెంబర్ 27ను తీసుకురావడం జరిగిందని ఆరోపించారు. ఈ జీవో ద్వారా 5 లక్షల కోట్ల రూపాయల భూములను 5000 కోట్లకు కట్టబెట్టి మిగతాది ఎవరి జోబులోకి పోతున్నాయనేధి బిఆర్ఎస్ పార్టీ సూటి ప్రశ్నని నిలదీశారు. ప్రభుత్వాన్ని నిలదీస్తాం..9300 ఎకరాల స్థలాలను ఇక్కడి ప్రజానీకానికి ఉద్యోగ, ఉపాధికై పారిశ్రామిక వాడల ద్వారా కేటాయిస్తే వాటిని రెగ్యులరైజ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ దందాకు తెర లేపడంతోపాటుగా ఆయా భూములను వారి అనుచరులు, కుటుంబ సభ్యులు, భాగస్వాములు, పినా మీ పేర్ల మీద అగ్రిమెంట్లు చేసుకొని ఇంటర్నల్ ట్రేడింగ్ కు పాల్పడుతూ కోట్ల రూపాయలను అక్రమ మార్గంలో దోచుకుంటున్నారని, ప్రభుత్వ భూములను కాజేసేందుకు విడుదల చేసిన జీవో. నెంబర్ 27ను వెంటనే ఉపసంహరించుకోవాలని బిఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్ అని, లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలోని అన్ని వేదికలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని హెచ్చరించారు.




