ప్రాజెక్ట్ పనులు వెంటనే పూర్తి చేయాలి…మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులకు జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు.బుధవారం కలెక్టరేట్ విసి హాలులో జాతీయ రహాదారుల నిర్మాణాల పై నిర్వహించిన సమీక్ష సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.ఈ సమావేశంలో ఎన్ హెచ్ ఎఐ పిడి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమస్యలను కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అన్నారు. జాతీయ రహాదారుల నిర్మాణాలకు సంబంధించి రోడ్డు విస్తరణ పై ఉన్న సమస్యలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పరిశీలించారు. రోడ్డు విస్తరణకు సంబంధించిన కోర్టు కేసులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ రోడ్డు విస్తరణకు ఎదురవుతున్న సమస్యలను పరిశీలించి ప్రతి కేసు పూర్వపరాలు తెలుసుకొని, తీసుకోవలసిన చర్యల పై అధికారులకు అవసరమైన సలహాలు సూచనలు చేసారు.ఈ కార్యక్రమంలో కీసర ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

