అక్షర గళం, మాదాపూర్ : శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళ సందర్భంగా ఏర్పాటు చేసిన హస్తకళ ఉత్పత్తులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా శ్రీ శివ స్వరూప్ వాయిలిన్ కచేరి, యుఎస్ నుండి విచ్చేసిన శ్వేతా రవిశంకర్ భరతనాట్య ప్రదర్శన, ఆర్తి శంకర్ కథక్ నృత్య ప్రదర్శన ఆలరించింది. సౌత్ జోనే కల్చరల్ సెంటర్ తంజావూర్ వారు పంపించిన ఒరిస్సా నుండి విచ్చేసిన సంబల్పూరి నృత్య కళాకారులు శశాంక్ శర్మ బృంద ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది.

