– చిన్నతనం నుంచి మెథడిస్ట్ చర్చిలో జరుపుకోవడం నాకు ఒక ఆనవాయితీగా మారిపోయింది.
– నా బాల్యం అంతా కూడా మెథడిస్ట్ చర్చితో గడిచింది.
అక్షరగళం ,హైదరాబాద్, తన చిన్ననాటి నుంచి మెథడిస్ట్ చర్చితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. నాంపల్లి చాపెల్ రోడ్డులోని మెథడిస్ట్ చర్చిలో గురువారం క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన చిన్నతనం నుంచి మెథడిస్ట్ చర్చిలో జరుపుకోవడం నాకు ఒక ఆనవాయితీగా మారిపోయింది అని, నా స్కూల్ డేస్ లో కూడా ఈ చర్చ్ కి వచ్చేదానిని నా బాల్యం అంతా కూడా మెథడిస్ట్ చర్చితో గడిచింది అని తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు . కాబట్టి ఈ క్రిస్మస్ రోజున మీతో జరుపుకోవడం చాల సంతోషంగా ఉంది అని తెలంగాణ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు .

