– జగద్గిరిగుట్ట కార్పొరేటర్ పై కార్పొరేటర్ జగన్
అక్షరగళం, జగద్గిరిగుట్ట: కాలనీలు బస్తీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేస్తారని జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్ పేర్కొన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని షిరిడి హిల్స్ కాలనీ సమస్యలపై కాలనీవాసులు బిఆర్ఎస్ కార్పొరేటర్ జగన్ ను ఆయన నివాసంలో కలిసి కాలనీలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కాలనీ బస్తీలలో పర్యటించి సమస్యలను క్షేత్రస్థాయి పరిశీలన చేసి తగువిధంగా పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. షిరిడి హిల్స్ సంఘం అధ్యక్షులు మహేందర్‌తో పాటు రాంబాబు, చారి ఆదిలక్ష్మి, రాజు, రమేష్, మనీ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జున స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవంలో
అదే విధంగా, జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మగ్దూం నగర్‌లో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో కార్పొరేటర్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. కొమురవెల్లి మల్లన్న కళ్యాణ మహోత్సవం అనంతరం మగ్దూం నగర్ ఆలయంలో జరిగిన ఈ కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా సాగిందని తెలిపారు. స్వామివారి కృపకటాక్షాలతో జగద్గిరిగుట్ట డివిజన్ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కోలుకుల జైహింద్, బండ మహేందర్, రాయి విగ్నేష్, వినోద్, నాని చారి, ఆలయ కమిటీ అధ్యక్షులు సుజిత్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ రాజు, కమిటీ సభ్యులు రాములు, భాస్కర్, దినేష్, విటల్, కిషన్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

