సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో హైదరాబాద్ హ్యాట్రిక్
🔹 జమ్మూ–కశ్మీర్‌పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం
🔹 బౌలర్ల ధాటికి ప్రత్యర్థి 112కే కుప్పకూలింది
🔹 తనయ్ అర్ధసెంచరీ, ప్రజ్ఞయ్ రెడ్డి కీలక ఇన్నింగ్స్
అక్షరగళం, హైదరాబాద్:
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు విజృంభిస్తోంది. వరుసగా మూడు విజయాలు నమోదు చేసిన హైదరాబాద్ జట్టు గురువారం జమ్మూ–కశ్మీర్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి గ్రూప్ ‘బి’లో అగ్రస్థానానికి (16 పాయింట్లు) చేరుకుంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన జమ్మూ–కశ్మీర్ జట్టు హైదరాబాద్ బౌలర్ల ధాటికి నిలబడలేక 19.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. మిలింద్, నితిన్ సాయిలు చెరో మూడు వికెట్లు, రక్షణ్ రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని చిత్తు చేశారు. స్వల్ప లక్ష్య ఛేదనలో హైదరాబాద్ ఒక దశలో 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే ఈ సమయంలో తనయ్ ధాటిగా ఆడుతూ అర్ధసెంచరీ (50)తో జట్టు ఇన్నింగ్స్‌కి బలాన్నిచ్చాడు. ప్రజ్ఞయ్ రెడ్డి (31 నాటౌట్) అతనికి తోడుగా నిలిచి 15.1 ఓవర్లలో 115/6తో హైదరాబాద్ విజయం సాధించేటట్లు చేశాడు.

