– వేణుగోపాల్ స్వామి గుడిలో దొరికిన మంగళ సూత్రం, నిజాయితీగా జీడిమెట్ల పోలీసులకు అందజేత
– పోగొట్టుకున్న వాళ్ళు ఆధారాలతో సంప్రదించండి: సి ఐ గడ్డం మల్లేష్
అక్షరగళం, జీడిమెట్ల: గుడికి వచ్చిన ఓ భక్తురాలు పోగొట్టుకున్న మంగళసూత్రాన్ని నిజాయితీగా అదే గుడికి వచ్చిన మరొక భక్తుడు దానిని పోలీసులకు అప్పగించాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో ఓ వ్యక్తికి బంగారు మంగళసూత్రం దొరికింది. దానిని అతను జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో అందజేసి నిజాయితీని చాటుకున్నాడు. బంగారాన్ని పోగొట్టుకున్న అసలైన వారికి దానిని అప్పగించాల్సిందిగా కోరాడు. స్పందించిన జీడిమెట్ల పోలీసులు బంగారం పోగొట్టుకున్న వారు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. పోగొట్టుకున్న బంగారాన్ని ఆధారాలతో సహా సరైన వివరాలు తెలియజేసిన సందర్భంలోనే బంగారాన్ని అందజేస్తామని జీడిమెట్ల సీఐ స్పష్టంగా తెలియజేశారు. ఎంతో నిజాయితీతో దొరికిన ఐదు తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించిన వ్యక్తిని ఈ సందర్భంగా అభినందించారూ.

