ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో ప్రతీ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు తన నివాసంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంటారు.ఈ సందర్భంగా ప్రజలు రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పింఛన్లు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం తదితర సమస్యలపై తమ వినతిపత్రాలను ఎమ్మెల్యే గారికి అందజేశారు. ప్రతి వినతిని శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే గారు సంబంధిత శాఖ అధికారులతో తక్షణమే మాట్లాడి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, “ప్రజల సమస్యలే నా ప్రాధాన్యం. ప్రతి ఒక్కరి సమస్యకు పరిష్కారం చూపించడమే నా బాధ్యత. ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటాను” అని ఎమ్మెల్యే గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంక్షేమ సంఘాల నాయకులు, సభ్యులు, పార్టీ నాయకులు, మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

