– ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
అక్షరగళం, కుత్బుల్లాపూర్: నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు పేర్కొన్నారు. దుందిగల్ సర్కిల్ శంభీపూర్‌లోని కార్యాలయంలో ఆదివారం పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న పలు ప్రజా సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

