Tuesday, January 13, 2026
No menu items!
Advertisement
హోమ్జిహెచ్​​ఎంసిALLవాహనదారులకు మాస్ వార్నింగ్! న్యూయర్ ఫీవర్.. మీటర్ దాటితే జైలుకే..!

వాహనదారులకు మాస్ వార్నింగ్! న్యూయర్ ఫీవర్.. మీటర్ దాటితే జైలుకే..!

– న్యూయర్ వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు

– డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే.. వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా

– ఎక్కువ మోతాదులో తాగి పట్టుబడితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు

అక్షరగళం , హైదరాబాద్ , న్యూయర్ వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని వాహనదారులకు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్‌ హెచ్చిరకలు జారీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే.. వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా తో పాటు ఆరు నెలల జైలు శిక్ష తప్పదన్నారు.

ఎక్కువ మోతాదులో తాగి పట్టుబడితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామన్నారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టారు నగర పోలీసులు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌లోని టీజీ స్టడీ సర్కిల్‌ వద్ద నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. తనిఖీలు జరుగుతున్న విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారితో మాట్లాడి.. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వారికి వివరించారు.

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు. డిసెంబరు 31 రాత్రి వరకు నగరవ్యాప్తంగా ‘స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో పట్టుబడితే వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. తీవ్రతను బట్టి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేలా రవాణా శాఖకు సిఫార్సు చేస్తామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments