Wednesday, January 14, 2026
No menu items!
Advertisement
హోమ్క్రైమ్సైబ‌ర్ క్రైమ్‌లో కొత్త కోణం…

సైబ‌ర్ క్రైమ్‌లో కొత్త కోణం…

*బ‌య‌ట‌పడుతున్న వ‌ల‌పు వ‌ల‌లు…

Hyderabad: Cyber Crime
సైబ‌ర్ క్రైమ్‌లో కొత్త కోణం…

*బ‌య‌ట‌పడుతున్న వ‌ల‌పు వ‌ల‌లు…
*యూకే డాక్టర్‌ పేరుతో చీటింగ్‌…
*ఆన్‌లైన్‌లో మహిళ పరిచయం… పెళ్లి చేసుకుంటానని మోసం…
*రూ.3.38 లక్షలకు టోకరా

యూకేలో డాక్టర్ గా పనిచేస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళను మోసం చేసిన వ్యక్తి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి ఆ మహిళ నమ్మించి రూ.3.38 లక్షలకు వసూలు చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

  • ఆన్‌లైన్‌లో మహిళ పరిచయం.. పెళ్లి చేసుకుంటానని మోసం
  • రూ.3.38 లక్షలకు టోకరా

క్రైమ్ న్యూస్‌, హైద‌రాబాద్‌ (అక్ష‌ర గ‌ళం) :
సైబ‌ర్ నేర‌గాళ్ళు రోజుకో అవ‌తారం ఎత్తుతున్నారు. అమాయ‌కుల‌కు వ‌లప‌న్ని ఆగం చేస్తున్నారు. వ‌ల‌పు వ‌ల‌లు వేసి నిండా ముంచుతున్నారు. యూకేలో వైద్యుడిగా పని చేస్తున్నానంటూ… ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మ‌హిళ‌ను మోసం చేసిన సంఘ‌ట‌న హైద‌రాబాద్‌లో తాజాగా వెలుగు చూసింది.

ముందుగా ఆన్‌లైన్‌లో మ‌హిళ‌ను ప‌రిచ‌యం చేసుకున్న దుండ‌గుడు…ప్రేమ పేరుతో వ‌ల‌పు నాట‌కానికి తెర తీశాడు.
వీసా కోసం ఎదురుచూస్తున్న ఆ మహిళకు వరుస ఫోన్‌లు చేసి పలు చార్జీల పేరుతో రూ.3.38 లక్షలు వసూలు చేసి మాయమయ్యాడు. సైదాబాద్‌(Saidabad)కు చెందిన మహిళ(47)కు ఆన్‌లైన్‌లో హిరాద్‌ అహ్మద్‌(Hirad Ahmed) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. యూకే(UK) వైద్యుడిగా పనిచేస్తున్నానని నమ్మించి వాట్సప్‌ చాటింగ్‌, వీడియో కాల్‌ చేసేవాడు. యూకే(UK)కు వస్తే పెళ్లి చేసుకుంటాననని నమ్మించాడు.
వీసా ప్రాసెసింగ్‌లో భాగమని చెప్పడంతో ఆమె బ్యాంకు ఖాతాలు, సిమ్‌ కార్డులు యూకే అఫైర్స్‌ ఆఫీస్‌ పేరుతో అతడు సూచించిన అడ్రస్ కు పంపింది.

వివాహ పత్రాల ప్రాసెసింగ్‌ మొదలైందని చెప్పి నకిలీ పత్రాలు పంపాడు. తర్వాత రంగంలోకి దిగిన మిగ‌తా సైబ‌ర్ నేరగాళ్లు… ప‌థ‌కం ప్ర‌కారం కొత్త నెంబర్ల నుంచి ఆమెను సంప్రదించారు. పలు చార్జీలు, విమాన టికెట్లు, మెడికల్‌ ఫీజులు, రిఫండబుల్‌ ఎమౌంట్‌ అంటూ పలుదఫాలుగా రూ.3.38 లక్షలు వసూలు చేశారు. యూకే డాక్టర్‌ అందుబాటులోకి రాకపోవడం, కొత్త నంబర్ల నుంచి ఫోన్లు వచ్చి డబ్బులు డిమాండ్‌ చేయడంతో తాను మోసపోయానని బాధితురాలు గ్రహించింది. వెంట‌నే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ఆధారాల ప్ర‌కారం సైబ‌ర్ నేర‌గాళ్ళ‌పై నిఘా ఉంచామంటున్నారు అధికారులు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments