ఉదయం 10 గంటల సమయంలో కొన్ని సెకండ్ల పాటు షేక్.. పాఠశాల నుంచి బయటకు వచ్చిన పిల్లలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం ఆదర్శనగర్‌లో గురువారం ఉదయం ఒక్కసారిగా కలకలం చోటుచేసుకుంది.
ఉదయం 10 గంటల సమయంలో భూమి కొన్ని సెకండ్ల పాటు కదిలినట్లు స్థానికులు చెబుతున్నారు. అకస్మాత్తుగా భూమి షేక్ అయినట్లు అనిపించడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
వీడియోల్లో కనిపించిన పాఠశాల దృశ్యాలు
ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తీసిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీడియోల్లో ఓ పాఠశాల నుంచి చిన్నపిల్లలు భయంతో తరగతుల నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఎలాంటి నష్టం లేదు
ఈ ఘటనలో ప్రస్తుతం ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అయితే భూమి కంపించడానికి గల కారణం ఏమిటన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
భూకంప ప్రభావమా? లేక మరో కారణమా?
ఇది భూకంప ప్రభావమా? లేదా స్థానికంగా ఏదైనా ఇతర కారణంతో కంపనం ఏర్పడిందా? అనే అంశంపై అధికారులు, నిపుణుల నుంచి ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

