అందుకే సీఎం రేవంత్ రెడ్డి వెంట నాగార్జున తిరుగుతున్నారా..?
నాగార్జున మనసులో ఏముంది..?
ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియో తరలిస్తారా..?
అందుకే సీఎం రేవంత్ రెడ్డి వెంట నాగార్జున తిరుగుతున్నారా..?
నాగార్జున మనసులో ఏముంది..?
ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియో తరలిస్తారా..?
నాగార్జున మనసులో ఏముంది..? అనే ప్రశ్నలు ఆయన అభిమానుల్లో మొదలయ్యాయి.
ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో నాగార్జున ప్రధాన ఆకర్షణగా నిలిచారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంట ఫ్యూచర్ సిటీకి వచ్చిన నాగార్జున… అక్కడ ముఖ్యమంత్రితో కలిసి స్టాల్స్ పరిశీలించారు. ఈ సందర్భంగా నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని.. ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ని కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామని ప్రకటించారు. ఇక్కడ ఒక ఫిలిం హబ్ ని కూడా తయారు చేయాలని చర్చలు జరుగుతున్నాయని..అన్నపూర్ణ స్టూడియోస్‌ని కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకు వచ్చే అవకాశం ఉందన్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే…అన్నపూర్ణ స్టూడియో ఫ్యూచర్ సిటీకి తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
అందుకే సీఎం రేవంత్ రెడ్డి వెంట నాగార్జున తిరుగుతున్నారా..?
అయితే కొత్తగా అన్నపూర్ణ స్టూడియో కొత్త బ్రాంచ్‌ను ప్యూచర్ సిటీలో నిర్మిస్తారా..? లేకపోతే… పూర్తిగా బంజారాహిల్స్ నుంచి తరలిస్తారా..? అన్నవిషయంలో క్లారిటీ లేదు.
అన్నపూర్ణ స్టూడియోను నిర్మించినప్పుడు అవి కొండలు, గుట్టలు, అతి కష్టం మీద నిర్మాణాలను పూర్తి చేశారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో అత్యంత బిజీ ఏరియాల్లో ఒకటి. ఆ ల్యాండ్ వేల కోట్ల ఖరీదు చేస్తుంది. హిల్ట్ పాలసీలో భాగంగా అన్నపూర్ణ స్టూడియోను ఫ్యూచరీ సిటీకి తరలించేలా ఏమైనా ఒప్పందం చేసుకుంటున్నారా…? అన్నది తెలాల్సి ఉంది.
హిల్ట్ పాలసీ ప్రకారం.. ప్రభుత్వం .. ఓ పర్పస్ కోసం కేటాయించిన భూములు అంటే.. ఫ్యాక్టరీ లేదా సినీ స్టూడియో వంటి వాటికి కేటాయించిన భూములు వాటికే వినియోగించాలి. ఇతర వాటికి అనుమతి లేదు. అన్నపూర్ణ స్టూడియో.. స్టూడియో నిర్వహణకు మాత్రమే ఆ స్థలంలో వినియోగించాలి. మల్టీ యూజ్ గా ప్రభుత్వం అనుమతి ఇస్తే… ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియోను తరలించి.. పాత స్టూడియో స్థలంలో రియల్ ఎస్టేట్, హోటల్స్ వంటి వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. నాగార్జున మంచి నటుడే కాదు…ఆయనలో మంచి బిజినెస్‌మెన్ కూడా ఉన్నారు. మరి నాగార్జున మనసులో ఏముందో..?

