Wednesday, January 14, 2026
No menu items!
Advertisement
హోమ్జిహెచ్​​ఎంసిహైదరాబాద్‌లో అతి పెద్ద మాల్..!

హైదరాబాద్‌లో అతి పెద్ద మాల్..!

నగరవాసులకు గుడ్ న్యూస్

హైదరాబాద్‌లో అతి పెద్ద మాల్..!
నగరవాసులకు గుడ్ న్యూస్
అయితే…ట్రాఫిక్ ఇబ్బందులు త‌ప్ప‌వా..?
ఆందోళ‌న‌లో వాహ‌న‌దారులు

హైదరాబాద్‌లో అతి పెద్ద మాల్ లేక్‌షోర్
కూకట్‌పల్లిలో నిర్మాణమవుతోన్న లేక్‌షేర్ మాల్
ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతుందని ఆందోళన


హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రం రోజు రోజుకు విస్త‌రిస్తోంది. ఒక ప‌క్క సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక వ్యూహంతో న‌గ‌రాన్ని దేశంలోనే అతిపెద్ద కార్పొరేష‌న్‌గా రూపొం చ‌డాని కృషి చేస్తుండ‌గా…మ‌రోవైపు ఆకాశానికి అంటే హర్మ్యాలు .. అతి పెద్ద కట్టడాలు… షాపింగ్ మాల్స్ కూడా వెలుస్తున్నాయి.
ఇప్పుడు ఓ అద్బుతమైన వార్తా అందరినీ ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌లో అతి పెద్ద మాల్ లేక్‌షోర్ పైనే ఇప్పుడు అందరి కళ్ళు .. ఆలోచనలు తిరుగుతున్నాయి.

హైదరాబాద్ వాసులకు ఇది పండగలాంటి వార్తే. నగరవాసుల కోసం కూకట్‌పల్లిలో లేక్‌షోర్ అనే సరికొత్త, భారీ షాపింగ్ మాల్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది నగరంలోనే అతిపెద్ద మాల్‌గా నిలవనుంది. షాపింగ్, వినోదం, ఫుడ్ కోర్ట్ వంటి అన్ని సౌకర్యాలతో పాటు, మెట్రో స్టేషన్‌కు నేరుగా అనుసంధానం కావడం దీని ప్రత్యేకత. అయితే, దీనివల్ల ట్రాఫిక్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నగర వాసులకు శుభవార్త.. హైదరాబాద్‌లో త్వరలోనే మరో మాల్ ప్రారంభం కానుంది. ఇటీవల, శరత్ సిటీ క్యాపిటల్ మాల్ భారతదేశంలోని టాప్ 5 అతిపెద్ద మాల్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైదరాబాద్‌లో ఇప్పుడు అంతకంటే పెద్ద మాల్ లేక్‌షోర్ ప్రారంభానికి రెడీ అవుతోంది. కూకట్‌పల్లిలో నిర్మిస్తున్న ఈ మాల్ నిర్మాణం ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఇది డిసెంబర్ 12న ప్రారంభం కానుందని తెలుస్తోంది. లేక్‌షోర్ మాల్ హైదరాబాద్‌లోనే అతి పెద్ద మాల్‌గా నిలవబోతుంది. షాపింగ్, గేమింగ్, మూవీస్, ఫుడ్ కోర్ట్ ఇలా సకల సౌకర్యాలతో.. భారీ విస్తీర్ణంలో ఈ మాల్ ప్రారంభం కాబోతుంది.

లేక్‌షోర్ మాల్‌ని దాదాపు 1.66 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇది హైదరాబాద్‌లోని అతిపెద్ద రిటైల్ ల్యాండ్‌మార్క్‌లలో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. ASBL ల్యాండ్‌మార్క్ ప్రకారం, ఇది శరత్ సిటీ క్యాపిటల్ మాల్ కంటే 32 శాతం పెద్దదిగా.. ఇన్‌ఆర్బిట్ మాల్ కంటే దాదాపు రెట్టింపు పరిమాణంలో ఉంటుందని సమాచారం. అయితే దీని గురించి మాల్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. నగరంలో ఇదే అతి పెద్ద మాల్‌ అంటూ ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది.

డిసెంబర్ 12న గ్రాండ్‌గా ప్రారంభించబోతున్నారని భావిస్తున్న ఈ మాల్‌లో 100కు పైగా షోరూమ్‌లు ఉండనున్నాయి. అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్‌లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. H&M, లైఫ్‌స్టైల్, స్టార్‌బక్స్, మ్యాక్స్ వంటి పెద్ద పేర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, టెక్, ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగాలకు చెందిన మరిన్ని ప్రముఖ బ్రాండ్‌లు కూడా చేరనున్నాయి. వినోదం విషయానికొస్తే, పీవీఆర్ మాల్ ప్రీమియం P[XL] ఫార్మాట్‌తో కూడిన థియేటర్‌ను తీసుకువస్తోంది. హైదరాబాద్‌లో ఇది రెండో P[XL] స్క్రీన్ అవుతుంది. మొదటిది ఇన్‌ఆర్బిట్ మాల్‌లో ఉంది.

మాల్‌కి రావాలనుకునే వారు.. కూకట్‌పల్లిలోని బాలానగర్ మెట్రో స్టేషన్ నుండి నేరుగా మాల్‌లోకి ప్రవేశించవచ్చు. నగరంలో మెట్రో స్టేషన్‌కు నేరుగా అనుసంధానించబడిన కొన్ని మాల్స్‌లో లేక్‌షోర్ మాల్ ఒకటి. మాల్ ఓపెనింగ్ సంగతి పక్కకు పెడితే.. దీని వల్ల కూకట్‌పల్లి ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్‌లో లులూ మాల్ ప్రారంభంలో కూకుట్‌పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మాల్‌కు మెట్రో కనెక్టివిటీ ఉన్నప్పటికీ, సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే చుట్టుపక్కల రోడ్లు, లేక్‌షోర్ మాల్ తెరిచిన తర్వాత వచ్చే మరింత రద్దీగా మారతాయని.. ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments