అల్లరి నరేశ్, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ’12ఏ రైల్వే కాలనీ’. నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే . ఈ సినిమా, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ హఠాత్తుగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ చిత్రం ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం.నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లరి నరేశ్‌కు జోడీగా కామాక్షి భాస్కర్ల నటించారు. సీనియర్ నటుడు సాయికుమార్, గెటప్ శ్రీను, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అల్లరి నరేశ్ మరోసారి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.ఇక కథ విషయానికొస్తే.. వరంగల్ రైల్వే కాలనీలో నివసించే అనాథ కార్తీక్ (అల్లరి నరేశ్), స్థానిక రాజకీయ నాయకుడికి నమ్మినబంటుగా ఉంటాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఆటల పోటీల్లో ఆరాధన (కామాక్షి భాస్కర్ల)ను చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆరాధన ఎవరు? ఆమె గతం ఏమిటి? ఆమె తన భార్య అంటూ కథలోకి ప్రవేశించిన జయదేవ్ షిండే ఎవరు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా సాగుతుంది.
ఓటీటీలోకి వచ్చేసిన ’12ఏ రైల్వే కాలనీ’ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
0
26
మునుపటి వ్యాసం
తదుపరి ఆర్టికల్
RELATED ARTICLES

