Yechuri Sitaram: తెలంగాణ రాయకీయాలు ఇప్పుడు మరింత హీట్ మీద ఉన్నాయి.సీఎం రేవంత్ రెడ్డి కి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ కు మధ్య మాటల యుద్ధం జరిగింది.
Yechuri Sitaram:అలాంటిది ఈ రోజు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్కరణ సభకు కేటీర్ మరియు రేవంత్ రెడ్డి వచ్చారు. ఏచూరి సీతారాం సంస్కరణ సభ రవీంద్ర భారతిలో సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.
KTR:ముందుగా కేటీర్ ఏచూరి గారికి నివాళి అర్పించారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని ఈ రోజుల్లో సీతారాం ఏచూరి ఒకే పార్టీలో ఉన్నారని, ఉన్నత కుటుంబంలో పుట్టి కూడా అణగారిన వర్గాల కోసం పోరాటం చేశారన్నారు.ఆయన జీవితం మాలాంటి యువ నాయకులకు ఎంతో స్ఫూర్తిదాయం అని కొనియాడారు.పార్టీలు వేరు కావచ్చు,సిద్దాంతాలు వేరు కావచ్చు,కానీ ఉద్యమాలు చేసే విధానంలో మాది రక్త సంబంధం అని అన్నారు.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నపుడు మేము తప్పకుండా ప్రశ్నిస్తామన్నారు.
CM Revanth Reddy:ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని దివంగత సీతారాం ఏచూరి నిలిపారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.దశాబ్దాలపాటు పేదల సమస్యలపై ఏచూరి కృషి చేశారని తెలిపారు.
ఈ సందర్భంగా యూనియన్ ఆఫ్ స్టేట్స్ భావనను దెబ్బతీసేలా బీజేపీ జమిలి ఎన్నికలను తీసుకొస్తుందని కేంద్రంపై మండిపడ్డారు. బీజేపీని నిలువరించడానికి కాంగ్రెస్ , కమ్యూనిస్టులు కలిసి పనిచేసేలా ఏచూరి కీలకపాత్ర పోషించారని రేవంత్ రెడ్డి వివరించారు.ఈ సమయంలో ఏచూరి సీతారాం లేకపోవడం దేశానికి తీరని లోటని అన్నారు.