Tuesday, January 13, 2026
No menu items!
Advertisement
హోమ్జిహెచ్​​ఎంసిALLపురిటి నొప్పుల వేళ ప్రాణరక్షణ

పురిటి నొప్పుల వేళ ప్రాణరక్షణ

– ఇంట్లోనే డెలివరీ చేసిన 108 సిబ్బంది

అక్షరగళం, పేట్ బషీరాబాద్: పురిటి నొప్పుల తో బాధపడుతున్న ఓ మహిళకు పురుడు పోశారు 108 సిబ్బంది. కుత్బుల్లాపూర్ ఎమ్‌ఎన్‌ రెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్న దుర్గం సునీత (25) 108 అంబులెన్స్ సిబ్బంది సహకారంతో ఇంట్లోనే సురక్షితంగా ప్రసవించింది. ఉదయం పురిటి నొప్పులు తీవ్రంగా రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే అంబులెన్స్ సిబ్బంది ఎంటి నరేందర్ రెడ్డి, పైలట్ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అంచనా వేసి సునీతకు ఇంటిలోనే పురుడు పోశారు.
ఈ సందర్భంగా సునీత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, అబ్జర్వేషన్ కోసం వారిని అంబులెన్స్‌లో షాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని 108 సిబ్బంది పేర్కొన్నారు. సమయస్ఫూర్తితో ప్రాణాలను కాపాడిన అంబులెన్స్ సిబ్బందికి సునీత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments