చలి కాలం నీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా..? అయితే జాగ్రత్త…
చలికాలం వచ్చిందంటే…చల్లని గాలుల వల్ల దామం వెయ్యదు. అందుకే చాలా మంది నీళ్ళు తక్కువగా తాగుతారు. చలికాలంలో నీటిని కావాల్సినంత తీసుకోకపోతే మనం ప్రమాదం పడ్డట్టేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శీతాకాలంలో నిజానికి దాహం తక్కువగా వేసినట్టు మనకు అనిపిస్తుంది. కానీ మన శరీరానికి కావాల్సినంత నీరు అందకపోతే ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యి దీర్ఘ కాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
అయితే ఈ సమస్య నుంచి బయట పడటానికి మనం కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
శీతాకాలంలో కాలంలో మనలో చాలామంది నీళ్లు చాలా తక్కువగా తాగుతూ ఉంటారు. వాతావరం చల్లగా ఉండటంతో దాహం తక్కువగా ఉంటుంది. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, శీతాకాలం నిశ్శబ్దంగా మనల్ని డీహైడ్రేట్ చేస్తుంది. చల్లని గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. మనకు ఎక్కువగా చెమట పట్టదు. ఈ సీజన్ మన శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోం. ఈ సీజన్‌లో మనకు దాహం వేయకపోయినా, శరీరం శక్తివంతంగా ఉండటానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, శరీరాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచడానికి నీరు చాలా అవసరం అని నిపుణులు అంటున్నారు.
చలికాలంలో వాతావరణం తేమగా ఉంటుంది కాబట్టి మనకు చెమట ఎక్కువగా పట్టదు. దీంతో ఎక్కువగా నీళ్ళు తాగాల్సిన అవసరం లేదని చాలా మంది అనుకుంటారు. ఇదే మనం చేసే అతిపెద్ద పొరపాటు. మన శరీరం మనకు తెలియకుండానే…చల్లని గాలిని గ్రహించి వెచ్చని తేమను వదిలేస్తుంది. దీంతో శరీరం నుంచి నీరు బయటకు వెళ్ళినట్టు మనకు తెలియదు. అందుకే నీటిని తీసుకోవాలన్న ద్యాస ఉండదు. ఇలా తక్కువగా నీటిని తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై తల తిరగడం, అలసట వంటి చికాకులు మొదలవుతాయి. ఇవి ఒక్కోసారి తీవ్రంగా ఉండి…అనారోగ్యం బారినపడే అవకాశం ఉంది.
మరి ఏం చెయ్యాలి..?
మన శరీరానికి కావాల్సినంత నీరు అందకపోతే…రకరకాల సమస్యలు ఎదురవుతాయి. మెదడుకు కూడా కావాల్సినంత ఆక్సిజన్ అందక తొందరగా అలసిపోతాం. దీనికి విరుగుడుగా…దాహంగా అనిపించకపోయినా…ప్రతీ గంటకు ఒక్కసారైనా కొన్ని నీళ్లు తాగుతుండాలి. నీరు తాగడం ఇష్టం లేకపోతే..నిమ్మకాయ నీళ్ళు, ఇతర ఇష్టమైన జ్యూస్‌లు ట్రై చెయ్యవచ్చు. అసలు ఏ కాలంలోనైనా 8 గ్లాసులకు తక్కువకాకుండా నీళ్ళు తాగాలన్న విషయాన్ని మరిచిపోవద్దు.
నీరు లేకపోతే…తగ్గే ఇమ్యూనిటీ పవర్
గంటలు గంటలు నీరు తాగకుండా పనిపడిపోయి నిర్లక్ష్యం చేస్తే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. దీంతో శరీరం డీహైడ్రేట్‌గా మారి ప్రధాన ఇన్‌పుట్ అవయాలైన ముక్కు, గొంతు పొరలు పొడిబారుతాయి. దీనివల్ల శరీరంపై బ్యాడ్ బ్యాక్టీరియా దాడి పెరుగుతుంది. కావాల్సనంత నీటిని సేవిస్తే రోగ నిరోధక వ్యవస్థ ఆక్టీవ్‌గా పని చేస్తుంది. మంచి నీటితో పాటు కొబ్బరి నీళ్లు, ఇష్టమైన జ్యూస్‌లు, నిమ్మకాయ నీళ్లు తీసుకుంటే…శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
హైడ్రేషన్‌తో ఎన్ని లాభాలో…
చలికాలం చాలా మంది చర్మ, జుట్టు సమస్యలతో సతమతమవుతుంటారు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు పైపైన రాసే క్రీములు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తాయి. శాశ్వత పరిష్కారం కావాలంటే…శరీరానికి కావాల్సినంత ద్రవ పదార్థాలు అందించాలి. అప్పుడే మన శరీరం, మనసు ఉత్తేజంగా ఉండి…హాయిగా ఉండగలుగుతారు.
