aksharagalam.com

అత్తా కోడ‌ళ్ల పోరు…ధన్వాడ గ్రామం ద‌ద్ధ‌రిల్ల‌నుందా..?

అత్తా కోడ‌ళ్ల పోరు…ధన్వాడ గ్రామం ద‌ద్ధ‌రిల్ల‌నుందా..?

అక్క‌డ ఆ అత్త కోడ‌ళ్ళు ఇద్ద‌రు పెద్ద నాయ‌కులే. ఒక‌రు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పార్ల‌మెంట్ స‌భ్యురాలు డీకే అరుణ రెడ్డి కాగా…మ‌రొక‌రు నారాయ‌ణ‌పేట ఎమ్మెల్యే చిట్టెం ప‌ర్ణికారెడ్డి.
ప‌ర్ణికారెడ్డి పుట్టిన ఊరు ధ‌న్వాడ గ్రామంలో రెండో విడ‌త స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఇక్క‌డే వ‌చ్చింది అస‌లు చిక్కంతా…ఎంపీ డీకే అరుణ బీజేపీ నుంచి, ఎమ్మెల్యే చిట్టెం ప‌ర్ణికా రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎన్నిక‌య్యారు.
అత్త కోడ‌ళ్ళు ఇద్ద‌రిది ఒక్కోపార్టీ. ఒక‌టి కేంద్రంలో చ‌క్రం తిప్పుతుండ‌గా…మ‌రో పార్టీ రాష్ట్రంలో పాగా వేసింది.
అయితే ఈ గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు అత్త కోడ‌ళ్ళు తామ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మ‌ద్ధ‌తు ఇచ్చిన అభ్య‌ర్థుల‌ను గెలిపించుకునేందుకు ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్న‌ట్టు వినికిడి.
చూద్దాం…ఈ విష‌యంలో ఎంపీ అత్తా, ఎమ్మెల్యే కోడ‌ళ్ళ‌లో ఎవ‌రి పంతం గెల‌వ‌నుందో..!

Exit mobile version