వయనాడ్ వరద బాధితురాలు ప్రేమ కథ
Vayanad:కేరళలోని వాయనాడ్ లో వరదల కారణంగా ఓ యువతీ అనాథగా మారింది. తల్లితండ్రి తోపాటుగా మొత్తం 9 మందిని కోల్పోయి అనాథగా మారిన తనకి నేను ఉన్నానంటూ తన ప్రేమించిన వ్యక్తి అండగా నిలిచాడు. అయితే అది దేవుడికి నచ్చలేదు అనుకుంట అందుకే ఆమెను మరోసారి అనాథగా మార్చాడు.. ఏం జరిగింది అనేది అసలు వివరాలలోకి వెళ్తే…
Vayanad:కేరళ వాయనాడ్ వరదలు విలయతాండవం చేసిన తర్వాత బాధితులకు నేను ఉన్నానని చెప్పడానికి వెళ్లిన మోడీని ఒక ప్రేమ జంట పలకరించింది.
చురాలమాల గ్రామానికి చెందిన శృతి (24 ) ,బాల్య స్నేహితుడైన జెన్సన్ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మతాలు వేరైనా తల్లి తండ్రులు పెళ్ళికి ఓకే చెప్పారు.జూన్ 2 న నిశితార్థం జరిగింది. ఇక్కడివరకు అంత సంతోషంగా జరిగింది. అప్పుడే శృతి జీవితంలో జరిగిందొక పెను విషాదం..జూన్ 30 న జరిగిన వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తల్లితండ్రి తోపాటుగా మొత్తం 9 మందిని కోల్పోయి అనాథగా మారింది శృతి. అప్పుడే తన చిన్ననాటి స్నేహితుడైన జాన్సెన్ నేను ఉన్నానంటూ తన చేయి పట్టుకున్నాడు. జరిగింతంతా మర్చిపోయి ఆనందంగా ఉండాలనుకుంటున్న శృతి జీవితంతో విధి మరోసారి తన ప్రతాపం చూపించింది.అసలేం జరిగిందంటే..శృతి , జాన్సన్ చాల సింపుల్గా పెళ్లి చేసుకోవాలని కొని రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్ళికి ఏర్పాట్లు చేసుకున్నారు. పెళ్లి షాపింగ్ కోసం కుటుంబం అంత కలిసి కారులో వెళ్లారు.అయితే కోజికోడు కోల్లేగాలు రహదారి పై వీరి కారు ఒక ప్రెవేట్ వాహనాన్ని డీ కొంది. శృతి తో పాటు అందరికి చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగిలాయి కానీ జాన్సన్ కి మాత్రం తీవ్రంగా తగలడంతో హాస్పిటల్కి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న జాన్సన్ మరణించాడు.దాంతో శృతి మరోసారి అనాథగా మారింది.