సరిహద్దులపై కమిషనర్‌ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు ఉప్పల భాస్కర్, తెలంగాణ సాయి
గాజుల రామారాం, మహాదేవపురం, రోడా మేస్త్రి నగర్‌లకు సంబంధించి సరిహద్దుల అంశంపై గాజులరామారం మున్సిపల్ డీసీ మల్లారెడ్డిని మర్యాద పూర్వకంగా బీఆరఎస్ లీడర్ ఉప్పల భాస్కర్ కలిశారు. సరిహద్దుల సమస్యను పరిష్కరించాలని కమిషనర్‌ను కోరారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించినట్టు ఉప్పల భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియర్ నాయకుడు ఉప్పల భాస్కర్, తెలంగాణ సాయి, వారల వినోద్, రుద్ర అశోక్, అడ్వకేట్ కమలాకర్, శివ నాయక్, జునైద్, రంజాన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
