Tirumala Laddu:తిరుపతిలో తిరుమల ప్రసాదంలో ముఖ్యమైనది లడ్డు. ఇప్పుడు దానిమీదే ఏపీలో రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వును వాడారనే వార్త ఇప్పుడు ఏపీలో దుమారం లేపుతుంది.ఏకంగా చంద్రబాబే ఈ వాక్యాలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
Tirumala Laddu:శ్రీ వారి లడ్డూ ప్రసాదం ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబే ఆ వాక్యాలు చేయడం తో ఆ వార్త మరింత ట్రెండింగ్లో ఉంది. దానికి తోడు టీడీపీ నేతలు సైతం ఆధారాలు ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్ట్ ను బయటపెట్టడం ఇప్పుడు ఇంకా ఈ వార్తపై ఆసక్తిని పెంచింది . మాజీ TTD నేత ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని చెప్పడం ఇప్పుడు మరింత చర్చకు దారి తీసింది.ఇదంతా పక్కన పెడితే మాజీ TTD చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చంద్రబాబుకు సవాలు విసిరాడు.
జంతువుల కొవ్వు వినియోగించారని చేసిన ఆరోపణలను నిరూపించాలని అన్నారు.నేను కుటంబంతో సహా వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.ఇప్పుడు ఈ విషయమై ఏపీ లో చర్చలుగా నిలుస్తున్నాయి.
నిర్దారణ అయిందన్న చంద్రబాబు:
ఈ విషయమై చంద్రబాబు గురువారం మళ్ళి స్పందించారు. నిజంగానే లడ్డులో జంతువుల కొవ్వు వాడుతున్నారన్నారు.ఈ విషయం నిర్దారణ కూడా అయిందని చెప్పారు. ఈ విషయమై విచారణ జరుగుతుందని, తప్పుచేసిన ఎవరిని వదిలిపెట్టమని, అందరికి శిక్ష పడేలా చేస్తామన్నారు.భక్తుల నమ్మకంతో గత ప్రభుత్యం ఆడుకుందని, దేవుడితో పెట్టుకుంటే వచ్చే జన్మలోనే కాదు, ఈ జన్మలో కూడా శిక్ష తప్పదన్నారు.కోట్లాది మంది నమ్మి వచ్చే తిరుమల ప్రసాదాన్ని సైతం కల్తీ చేసి పడేశారని,ఇప్పుడు అంత సరి చేశామన్నారు.నాణ్యమైన ముడి సరుకుని సప్లై చేస్తున్నామన్నారు.
తిరుపతిలో ఉన్న నారా లోకేష్:
ఈ విషయమై లోకేష్ స్పందించారు.లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడుతున్నారని ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. నేను తిరుపతిలోనే ఉన్నానంటూ, సుబ్బారెడ్డి నువ్వు వస్తావా,లేదంటే జగన్ నువ్వు వస్తావా అని సవాలు విసిరాడు. దీని మీద ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.ఏం జరుతుందనే విషయం తిరుమల ప్రధాన అర్చకులు మాట్లాడితే కానీ నిజాలు తెలియవని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ రోజు అర్చకులు మీడియా తో మాట్లాడనున్నారు.