Telangana:రాష్ట్రంలో భద్రత గురించి వివేక్ మాట్లాడడం హాస్యాస్పదం అని అన్నారు.
Telanagana:కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
Telangana:ప్రజా కోణాన్ని జోడించి తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం గా నిర్వహించడం శుభ పరిణామమని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం గాజులరామారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారతదేశ అంతర్భాగం లో విలీనమైన రోజు అన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ విరుచుకుపడ్డారు. కుత్బుల్లాపూర్ గల్లీల్లో వివేక్ ను ఉరికిచ్చి కొడుతామని, మా సీఎం రేవంత్ రెడ్డి పై మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోమని హెచ్చరించారు.
టిడిపిలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి పిరాయించిన వివేకానంద్ కు కాంగ్రెస్ నాయకులపై మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు వివేకానంద తనపై దాడికి వచ్చాడని, తనకు సంస్కారం ఉండి అతనిపై తిరిగి దాడి చేయలేదని మాజీ ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో భద్రత గురించి వివేక్ మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు.వివేకానంద తన భాష మార్చుకోకపోతే కుత్బుల్లాపూర్ లో తిరగనియ్యం అని ఫైర్ అయ్యారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సొంటి రెడ్డి పున్నారెడ్డి, కౌన్సిలర్లు రాము గౌడ్, బైరి ప్రశాంత్ గౌడ్, మాజీ ప్రజా ప్రతినిధులు లక్ష్మా రెడ్డి, బొబ్బ రంగారావు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు జహంగీర్ భాయ్, దమ్మని శ్రవణ్ కుమార్, బుచ్చిరెడ్డి, కూన రాఘవేంద్ర గౌడ్, జిమ్మీ దేవేందర్, మోతే శ్రీనివాస్ యాదవ్, రమేష్ మంజులకర్, కృష్ణ యాదవ్, చౌడ శ్రీనివాస్, నాగిళ్ల శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి, శివకుమార్, బేక్ శ్రీనివాస్, మల్లేష్, రషీద్, రషీద్ బేగ్, బాలప్ప, సుశాంత్ గౌడ్, మధు, ఇందిరా, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.