Telangana:తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసారు.
Telangana: వెల్దండ మండల బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయు కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల యూత్ అధ్యక్షుడు జంగిలి యాదగిరి మాట్లాడుతూ…
Telangana: తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థలంలో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం యావత్ తెలంగాణ ప్రజానికని అవమాన పరచడమే అవుతుంది అని,ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసిన చర్యగా అభివర్ణించారు.
అందుకు నిరసిస్తూ నేడు కల్వకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారి పిలుపు మేరకు కల్వకుర్తి నియోజకవర్గంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంజయ్య , మాజీ ఉప సర్పంచ్ లు నిరంజన్, నరసింహా,కొప్పు కృష్ణయ్య, మండల సీనియర్ నాయకులు జంగిలి ప్రసాద్, సిద్దగోని రమేష్ గౌడ్, నాగేష్ ,శ్రావణ్ కుమార్,రవికుమార్ గౌడ్,కళాకారుడు వెంకట్, ఈదులపల్లి శ్రీనివాసులు, జంగిలి శ్రీనివాసులు, కోర్పూర్ కుమార్, ఎండీ జాపర్, కూన వెంకటయ్య ,రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.