అక్షరగళం , కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఐడీపీఎల్ భూములపై సమగ్ర విచారణ జరిపించాలని అక్రమాలకు కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖకు ప్రభుత్వం స్పందించింది. ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించడాన్ని ఏమ్మెల్యే స్వాగతించారు.. విచారణ చేయాలని కోరడమే తన నిజాయితీకి నిదర్శనమన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో తనను రాజకీయంగా ఎదుర్కోలేక కబ్జాల పేరుతో ఆరోపణలు చేస్తున్న నాయకులు ఇప్పటికైనా వారి వద్ద ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలని, మీడియా సంస్థలు కూడా ఆరోపణలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆధారాలను చూడాలని కోరారు.. గతంలోనూ తాను సంబంధిత అధికారులకు, కలెక్టర్ కు కబ్జాలపై ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఐడీపీఎల్ భూములపై విచారణ జరపలేదని రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.
ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు లేఖకు స్పందించిన ప్రభుత్వం…
