కూకట్‌పల్లి వివేకానంద నగర్ అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రాంగణంలో నిర్మాణం జరుగుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర సహిత శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయ నిర్మాణానికి వివేకానంద నగర్‌లోని మన హాస్పిటల్ డైరెక్టర్ శ్రీ రామకృష్ణ రెడ్డి గారు అక్షరాల రూ. 2,00,000/- (రెండు లక్షల రూపాయలు) విరాళంగా చెక్కును ఆలయ చైర్మన్ శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారికి ఈరోజు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ రాజేశ్వరరావు గారు మాట్లాడుతూ, ఆలయ నిర్మాణానికి శ్రీ రామకృష్ణ రెడ్డి గారు చేసిన ఈ మానవతా సేవ ప్రశంసనీయం అన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలిచే ఈ సేవాభావం మరింత మందికి ప్రేరణ కలిగించాలని ఆకాంక్షించారు. అలాగే, శ్రీ రామకృష్ణ రెడ్డి గారి కుటుంబంపై ఈశ్వరుని కృప ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించారు.
శ్రీ కాశీ విశ్వేశ్వర సహిత శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయ నిర్మాణానికి రూ. 2 లక్షల రూపాయలు విరాళం
