మానసిక వికలాంగులకు సేవలు అభినందనీయం
-టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్
అక్షరగళం, కూకట్‌పల్లి
మానసిక వికలాంగులను తల్లిదండ్రులే భారంగా భావించే నేటి పరిస్థితుల్లో… వారిని చేరదీసి కోలుకునేలా సేవలందించడం నిజంగా అభినందనీయమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్ కొనియాడారు. మోతీ నగర్ బబ్బుగూడ లోని జ్ఞానమాస్ మానసిక వికలాంగుల పాఠశాలలో దాతలు ఏర్పాటు చేసిన ఆట వస్తువుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ… మానసిక వికలాంగులకు సేవ చేయాలనుకోవడమే పెద్ద త్యాగ గుణానికి నిదర్శనం అన్నారు. డబ్బుతో సంబంధం లేకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అంటే ఎంతో త్యాగనిరతి ఉండాలన్నారు. పాఠశాలకు అవసరమైన సహాయాన్ని వ్యక్తిగతంగాను, ప్రభుత్వ పరంగాను అందేలా చూస్తానన్నారు. గత 13 సంవత్సరాలుగా ఈ సంస్థ ద్వారా మానసిక వికలాంగ చిన్నారులను కంటికి రెప్పలా కాపాడు తున్న సంస్థ నిర్వాహకులు కళ్యాణి కిరణ్ కుమార్ లను రమేష్ అభినందించారు . ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, కొప్పిశెట్టి దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
