Seasonal Diseases:మొన్నటిదాకా కురిసిన వర్షాల వల్ల చాల ప్రాంతాల్లో వ్యాధుల బారిన పడుతున్నారు.దానికి తోడు మళ్ళి శీతాకాలం దగ్గర పడుతుండడం తో వ్యాధులు ఇంకా ఎక్కువగా ప్రబలుతున్నాయి .
Seasonal Diseases:ముఖ్యంగా అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మరి ఎక్కువగా అంటూ వ్యాధులు వాటిల్లుతున్నాయి.జ్వరం, డెంగ్యూ ,మలేరియా లాంటి వ్యాధులతో గవెర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కిటకిటలాడుతున్నాయి.ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ అనే కాదు ప్రవేట్ హాస్పిటల్స్ ది కూడా అదే పరిస్థితి.మరి ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అయితే ఒక్క బెడ్ కి ఇద్దరు ముగ్గురిని ఉంచే పరిస్థితి ఏర్పడింది.ఇలాంటి తరుణంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం?
Seasonal Diseases:వాతావరణంలో మార్పులు రావడంతో సీజనల్ వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సీజనల్ ఫీవర్‌తో ఇప్పటికే చాలా మంది చాలా మంది మంచాన పడ్డారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిర్వహించాలని భావిస్తోంది. దీనిపై మంత్రి హరీశ్ రావు కూడా స్పందించారు. కాబట్టి సీజనల్ వ్యాధులు ఏమిటి? అవి ఎలా కనిపిస్తాయో తెలుసుకుందాం.
దగ్గు, జలుబు ,గొంతునొప్పి, జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ వ్యాధులు, జీర్ణ సంబంధిత రుగ్మతలను కాలానుగుణ వ్యాధులు అంటారు. అంతేకాకుండా వర్షాకాలంలో ఇన్‌ఫ్లుఎంజా, మలేరియా, డెంగ్యూ జ్వరం, టైఫాయిడ్, హెపటైటిస్ ఎ వంటి వ్యాధులు ప్రధానంగా కనిపిస్తాయి. అన్ని వయసుల వారికి ఈ వ్యాధులు వస్తాయి. అయితే ఈ వ్యాధులు చిన్న పిల్లలు, వృద్ధులకు ఎక్కువ హాని కలిగిస్తాయని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
ఈ వ్యాధులు ప్రధానంగా కలుషిత ఆహారం మరియు మురికి నీటి ద్వారా వ్యాపిస్తాయి. ఎక్కువ కాలం ఒకే చోట ఉండే కలుషిత నీరే ఈ వ్యాధులకు ప్రధాన కారణం. అందులో ముఖ్యమైనది దగ్గు. దగ్గు ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం చాల ఎక్కువ.
ముఖ్యంగా దోమల ద్వారా సంక్రమించేవి మలేరియా మరియు డెంగ్యూ వ్యాధులు.వీటితో పాటే “టైఫాయిడ్” అనే ప్రాణాంతక జ్వరం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ జ్వరం కూడా డెంగ్యూ జ్వరం లాంటిదే. అయితే, దాని పనితీరు చాలా ఎక్కువ. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత జలుబు మరియు కరోనావైరస్ నిర్ధారణ చాలా కష్టతరంగా మారిందని వైద్యులు అంటున్నారు. అందుకే జలుబు చేసినప్పుడు నిర్లక్షముగా వ్యవహరించడం మంచిది కాదని డాక్టర్స్ చెప్తున్నారు.
సీజనలు వ్యాధులు రాకుండా తీసుకోవలసిన చర్యలు:
చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.దీని వల్ల సీజనల్ వ్యాధులతో పాటు అతిసార వ్యాధి కూడా రాకుండా అరికట్టవచ్చు.
మనం తినే ఫుడ్, త్రాగే వాటర్ విషయంలో జాగ్రత్త తీసుకుంటే డయేరియా, జ్వరం, మలేరియా నుంచి రక్షణ పొందవచ్చు.
డెంగ్యూ, మలేరియా వ్యాధులు దోమల ద్వారా వస్తాయి.రాకుండా ఉండాలంటే దోమతెరలు వాడాలి.
మనం ఉంటున్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన చుట్టూ పక్కన మురికి నీరు ఉండకుండా చూసుకోవాలి.
కాచి చలార్చిన నీటినే త్రాగాలి.వీలైనంతగా వేడి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి
ముఖ్యంగా మాస్కు ధరించడం వల్ల జలుబు, దగ్గు రాకుండా ఉంటుంది.
తెలంగాణలో సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా వర్షాకాలంలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ వంటి వ్యాధులు ఎక్కువగా పెరిగి, ప్రజలను తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నాయి. చాలా మంది సీజనల్ వ్యాధుల వల్ల ఆసుపత్రుల్లో చేరుతున్నారు, కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని అరికట్టడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వం తీసుకోవాల్సిన నివారణ చర్యలు:
ప్రజలకు అవగాహన:
ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన పెంచాలి. డెంగీ, మలేరియా లాంటి వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం జరపాలి.
సానిటేషన్, పర్లం నీటి నిల్వల ప్రాముఖ్యత, క్లీన్ మరియు హైజీన్ గురించి అవగాహన కల్పించాలి.
ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు:
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో మొబైల్ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలకు ఉచిత పరీక్షలు, చికిత్సలు అందించాలి.
బహిరంగ ప్రదేశాల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్‌లను నిర్వహించి, వ్యాధులపై ముందస్తు పరీక్షలు చేయడం ద్వారా వ్యాధులను గుర్తించి, నివారించాలి.
మస్కిటో కంట్రోల్ ప్రోగ్రాములు:
మలేరియా, డెంగీ లాంటి వ్యాధులు తారసపడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రతి పట్టణం, గ్రామంలో క్రమంగా మస్కిటో కంట్రోల్ కార్యక్రమాలు నిర్వహించాలి.
డ్రైనేజ్ వంటివి శుభ్రం చేసి, నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి.
ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్సా సదుపాయాలు:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సరైన చికిత్స అందించేందుకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి.
అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
నిర్దిష్ట డేటా సేకరణ:
ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడ ప్రజలు సీజనల్ వ్యాధుల వల్ల చనిపోతున్నారో, వారికి ఉన్న పరిస్థితులు ఏంటో వివరణాత్మకంగా సేకరించి, డేటా ఆధారంగా వ్యాధుల నివారణ కోసం ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి.
జిల్లా వైద్య అధికారులు సమగ్ర నివేదికలు ఇవ్వాలి.
చనిపోయిన వారి వివరాలు:
ప్రతి సీజనల్ వ్యాధితో చనిపోయిన వారి వివరాలను ప్రభుత్వ ఆరోగ్య శాఖ సమగ్రంగా సేకరించి, వారి కుటుంబాలకు వైద్య సహాయం, ఆర్థిక సాయం చేయాలి.
ఈ విధంగా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటే సీజనల్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించవచ్చు, మరణాలను నివారించవచ్చు.