*– నగదు, మొబైళ్లు స్వాధీనం
*– వివరాలు వెల్లడించిన దుండిగల్ పోలీసులు
అక్షరగళం, కుత్బుల్లాపూర్: ఇంజనీరింగ్ కళాశాల రోడ్డు కు సమీపంలో వ్యవసాయ భూమిలో పేకాట ఆడుతున్న ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేశారు దుండిగల్ పోలీసులు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్లో స్థానికంగా ఉన్న ఎంఎల్ఆర్ఐటి కళాశాల రోడ్డులో ఉన్న ఒక సీడ్ కంపెనీ ఈ పక్కన ఉన్న ప్రాంతంలో పలువురు పేకాట ఆడుతున్నట్లుగా సమాచారం వచ్చింది పోలీసులకు. ఎస్‌ఐపీ కే. రంజిత్ కుమార్ రెడ్డి, కానిస్టేబుళ్లు దేవకుమార్, మహేష్‌లు ఘటనాస్థలికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అక్కడ ఏడుగురు వ్యక్తులు రమ్మీ ఆడుతున్నట్లుగా గుర్తించారు. ఇదే సమయంలో పోలీసులను గమనించిన ఇద్దరు పరారయ్యారు. కాగా ఎం. మల్లికార్జున్ (46) , ఎం. రవి (55) , ఎం. హన్మంతరావు (71), నరసింహ గౌడ్ (58) , మల్లేష్ (55) లను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.8,700 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, రెండు సెట్‌ల (మొత్తం 106) పేకాట కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
