అక్షరగళం,దుండిగల్: మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన కారు ఢీ కొట్టడంతో తాత, మనవడు తీవ్రంగా గాయపడిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బహదూర్‌పల్లి ఉదయిగిరి కాలనీలో బానుదాస్ అనే వ్యక్తి కార్పెంటర్‌గా పని చేస్తూ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఇతని మనవడు తనీష్ తరుచూ షాపునకు వస్తుండేవాడు. కాగా శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో స్థానికంగా ఉన్న రోడ్డుపై అతివేగంగా వచ్చిన కారు షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బానుదాస్, తనీష్‌లకు కాళ్లు విరగగా వారిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమీపంలోని మరో నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. కారులో ఉన్న ఐదుగురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. మద్యం మత్తులోనే కారును అతివేగంగా నడిపి ప్రమాదం చేశారని స్థానికులు అంటున్నారు. కాగా ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని దుండిగల్ పోలీసులు తెలిపారు.
వేగంగా దూసుకువచ్చిన కారు..–తాత, మనవడికి గాయాలు..
