చిత్తూరులో రోడ్ ప్రమాదం, 8 మంది మృతి
Road Accident:ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తిరుపతి జిల్లాలో నిన్న జరిగిన లారీ–,- కార్ ఘటన మరువకముందే చిత్తూరు జిల్లాలో శుక్రవారం మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
అమరావతి: APలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న తిరుపతి జిల్లాలో లారీ బోల్తా పడిన ఘటన మరువకముందే చిత్తూరు జిల్లాలో శుక్రవారం మరో ఘోర ప్రమాదం జరిగింది. మొగిలిలో రెండు ట్రక్కులను బస్సు ఢీకొనడంతో ఎనిమిది మంది బస్సు ప్రయాణికులు మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రాథమిక వివరాలు.. ఈ సంఘటన మధ్యాహ్నం జరిగింది. ఈ ఘటనలో బస్సు అదుపు తప్పిన విషయం తెలిసిందే. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.