aksharagalam.com

హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి బాంబు బెదిరింపు కలకలం

–దుబాయ్–హైదరాబాద్ విమానానికి బెదిరింపు కాల్… ప్రయాణికుల్లో ఆందోళన

–సురక్షితంగా ల్యాండింగ్… అప్రమత్తమైన భద్రతా దళాలు

అక్షర గళం, హైదరాబాద్:
హైదరాబాద్ రీజినల్ ఎయిర్‌పోర్టులో వరుసగా బాంబు బెదిరింపులు రావడం భద్రతా వ్యవస్థలు అప్రమత్తమవుతున్నాయి. గురువారం తెల్లవారుజామున దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఓ అంతర్జాతీయ విమానం కూడా ఇలాంటి బెదిరింపు కాల్‌కు గురైంది. విమానం గాల్లో ఉండగానే వచ్చిన హెచ్చరికతో అధికారులు వెంటనే అలర్ట్‌ అయ్యి అవసరమైన భద్రతా సమన్వయం చేపట్టారు.

సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్‌పోర్టు ATC (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసిందీ. పైలట్‌ సూచనల మేరకు అదనపు జాగ్రత్తలు తీసుకుంటూ విమానం హైదరాబాద్‌ షమ్‌షాబాద్ ఎయిర్‌పోర్టులో ఉదయం సురక్షితంగా ల్యాండ్‌ అయింది. ల్యాండింగ్ అనంతరం బాంబు స్క్వాడ్, CISF భద్రతా బృందాలు విమానం మొత్తం పరిశీలించాయి. ఇప్పటి వరకు అనుమానాస్పదమైన ఏదీ బయటపడలేదని ఎయిర్‌పోర్టు వర్గాలు ప్రాథమికంగా వెల్లడించాయి.

ఈ ఘటన పట్ల ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వరుస బెదిరింపులు రావడం పరిస్థితిని మరింత సున్నితంగా మార్చిందని, ఇలాంటి కాల్స్‌ మూలాన్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భద్రతా నిపుణులు భావిస్తున్నారు

Exit mobile version