*వెటాడి…వెంటాడి…*నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
Hyderabad Crime:
హడలిపోయిన హైదరాబాద్..! ఉలిక్కిపడ్డ జనం.!!
*వెటాడి…వెంటాడి…
*నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
*కత్తులు, తుపాకులతో కాల్చి చంపిన దుండగులు
*భయాందోళనకు గురైన స్థానికులు
హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బైక్‌పై వెంబడించి… కత్తులు, రివాల్వర్‌తో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా…నడిరొడ్డుపై నరికి చంపిన ఘటన సంచలనంగా మారింది.
స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ హత్య పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని…ప్రథమిక నిర్ధారణకు వచ్చారు.
జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య ఉదంతంలో హతుడు రియల్డర్ వెంకటరత్నంగా పోలీసులు గుర్తించారు.
సాకేత్ కాలనీ ఫోస్టర్ బిల్లా బాంగ్ స్కూల్ సమీపంలో నడిరోడ్డుపైనే వ్యాపారిని దారుణంగా హత్య చేశారు.
వెంకట రత్నం బైక్‌పై వెళ్తుండగా కొందరు వ్యక్తులు అతడిని మరో బైక్‌పై వెంబడించి అదును చూసి అతడిపై కిరాతకంగా దాడి చేశారు.
రియల్టర్ వెంటకట రత్నం స్పాట్‌లోనే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రియల్టర్ వెంకటరత్నం హత్య వెనుక ఉన్నకారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటన స్థలంలో ఒక బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వ్యాపారంలో డబ్బు వ్యావహరమే హత్యకు కారణమా..? ఇంకా మరేదైనా కారణముందా..? అనే విషయం తేలాల్సి ఉంది.
