Ranga Reddy:ఆమనగల్లులో రూ1.70కి లంబోదరని లడ్డు పలికింది.
RangaReddy:ఆమనగల్లు, ఆమనగల్లు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ కాలనీలో భజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు తొమ్మిది రోజులు పాటు విశేష పూజలందుకున్నారు.
గణేష్ నిమజ్జనం సందర్బంగా నిర్వహించిన లడ్డు వేలంలో కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డు వేలం పాటలో పట్టణానికి చెందిన కౌకుంట్ల శరత్ రెడ్డి 1.70 లక్షలకు లడ్డును దక్కించుకున్నారు.
ఇది ఆమనగల్లు పట్టణంలో రికార్డు దరగా ప్రజలు భావిస్తున్నారు. ధనలక్ష్మి మాలను మంచుకొండ చంద్రశేఖర్ 1,02,116 రూపాయలకు దక్కించుకున్నారు. ఆపిల్ కలశం శాలువాను పసునూరి విష్ణుమూర్తి 55,116 కు దక్కించుకున్నారు. ఈ సందర్బంగా గ్రహీతలకు శాలువాతో సన్మానించి, పుర వీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు.