ప్రారంభమైన మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్
మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అకాస్మాత్తుగా రాహుల్ ప్రత్యక్షం
ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియం వేదికగా మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ చూసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అకాస్మాత్తుగా
ప్రత్యక్షం కావడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. పూర్తి మ్యాచ్ కాకపోయినా…ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తలపడనుండటంతో ఉప్పల్ స్టేడియం మెస్సీ అభిమానులతో కిక్కిరిసిపోయింది.
ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అగ్ర నేతలు, సినీ ప్రముఖులతో పాటు అధికారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉప్పల్ స్టేడియంకు తరలివచ్చారు.
