aksharagalam.com

మంచినీటి సమస్య జటిలమవుతుంది

– వందల సంఖ్యలో నిర్మిస్తున్న ఫ్లాట్స్ వలన నీటి ఎద్దడి కలుగుతుంది

– వేసవిలో ఈ సమస్య మరింతగా మారుతుంది

– సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్న స్థానికులు

– కుత్బుల్లాపూర్ జలమండలి మేనేజర్ కు వినతిపత్రం అందజేత

అక్షరగళం, కుత్బుల్లాపూర్: పదుల సంఖ్యలో వెళుతున్న అపార్ట్మెంట్స్ లో వందల సంఖ్యలో ఫ్లాట్స్ నిర్మిస్తున్నారని వాటి ద్వారా మంచినీటి సరఫరాలో సమస్యలు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు మెట్ కాని కూడా వాసులు. ఈ మేరకు సోమవారం కుత్బుల్లాపూర్ జలమండలి మేనేజర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. జగద్గిరిగుట్ట నుంచి వచ్చే పైప్లైన్ ద్వారా మెట్ కాని కూడా, అయ్యప్ప కాలనీ, ఆదర్శనగర్, శ్రీ వెన్ ఎంక్లేవ్, కొలన్ ఎస్టేట్ కాలనీలకు సరిపోయినంత మంచినీటి సరఫరా అవుతుందని, కానీ ఇప్పటి ముప్పడిగా వస్తున్న అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వలన మంచినీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్నదని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సమస్య రాబోయే వేసవిలో తీవ్రతరం అవుతుందని ఇప్పటినుంచే దానికి పరిష్కారం మార్గం చూపి అంశంలో హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాలనీవాసులు ఫాక్స్ డైరెక్టరు పరుష శ్రీనివాస్ యాదవ్ , మెట్టుగానుగూడ ప్రెసిడెంట్ పి గోపాల్ యాదవ్, సమ్మయ్య, గణేష్ ఆదర్శనగర్ ప్రెసిడెంట్ ఎస్ గోపాల్ యాదవ్, జహీరుద్దీన్, నాగేందర్, ఈశ్వర్ రెడ్డి, జయరాం, నరేందర్,వెంకటేష్, మాధవి, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version