అక్షర గళం , కుత్బుల్లాపూర్ : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజాంపేట్ పరిధిలోని పలు దేవాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాస్ నగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి దేవాలయం, నిజాంపేట్ బస్ స్టాప్ వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాంపేట్ సర్కిల్ ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని,శ్రీమన్నారాయణుని & శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోలన్ బల్ రెడ్డి , సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, నాయకులు సాయి ముదిరాజ్, యువ నాయకులు ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేటలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
