aksharagalam.com

విద్యుత్ బకాయి సమస్యను పరిష్కరించండి

– మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్‌ను ఆశ్రయించిన రాజీవ్ గృహకల్ప వాసులు

– మోటార్ల కరెంట్ బిల్లుల బకాయితో కనెక్షన్ కట్ చేస్తామని అంటున్నారని ఆవేదన

– విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానన్న శ్రీశైలం గౌడ్

అక్షరగళం, కుత్బుల్లాపూర్: జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప కాలనీలో నీటి సరఫరాకు ఉపయోగిస్తున్న మోటార్లకు సంబంధించి విద్యుత్ బిల్లుల బకాయి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ను సోమవారం షాపూర్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

బకాయి కారణంగా విద్యుత్ అధికారులు మోటర్ కనెక్షన్లు కట్ చేస్తామని చెప్పడంతో ఆందోళనకు గురవుతున్నామని ఈ సందర్భంగా వారి సమస్యను ఆయనకి తెలిపారు.గతంలో ఉన్న కమిటీ ప్రతి ఇంటి నుంచి వసూలు చేసిన మొత్తాలను విద్యుత్ శాఖకు చెల్లించకపోవడం వల్లే బకాయి ఏర్పడిందని కాలనీవాసులు వివరించారు. దీనిపై స్పందించిన శ్రీశైలం గౌడ్ విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప అధ్యక్షుడు అంజయ్య, ప్రధాన కార్యదర్శి భూపతిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటస్వామి గౌడ్‌తో పాటు కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Exit mobile version