aksharagalam.com

మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్

అక్షరగళం , కుత్బుల్లాపూర్ నియోజకవర్గం : బహదురుపల్లి వార్డ్ నెంబర్‌–14 పరిధిలోని జివిఆర్ విల్లాస్‌లో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న మంచినీటి సరఫరా, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ తదితర మౌలిక వసతుల సమస్యలను సంఘం నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి వినతి పత్రం అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్, సంబంధిత అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేటివ్ చైర్మన్ మన్నే రాజు, కార్పొరేటర్ సురేష్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Exit mobile version