–నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కోలన్ హనుమంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్, (అక్షర గళం): కురుమ సంఘం అభివృద్ధికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కోలన్ హనుమంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ కురుమ సంఘం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం నూతన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, సభ్యులను కోలన్ హనుమంత్ రెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంఘం అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, సంఘ సమస్యలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కురుమ సంఘం ఇంచార్జ్ బట్ట పాలకృష్ణ కురుమ, చైర్మన్ బట్ట నరసింహ కురుమ, వైస్ చైర్మన్ జి.బాలరాజ్ కురుమ, అధ్యక్షులు నార్లకంటి బాలయ్య కురుమ, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయి కురుమ, వైస్ ప్రెసిడెంట్ వై యాదగిరి కురుమ, పి మహేందర్ కురుమ, కె.అంజయ్య కురుమ, నార్లకంటి పెంటయ్య కురుమ, నార్లకంటి దుర్గయ్య కురుమ, సర్వోజీ సత్తయ్య, ఉల్పి సత్తయ్య కురుమ, ఉల్పి వెంకటేష్ కురుమ, నార్లకంటి రమేష్ కురుమ,నార్లకంటి కుమార్ కురుమ, ఏ.కె. శ్రీశైలం కురుమ, నరేష్ కురుమ, సభ్యులు, కులస్తులు పాల్గొన్నారు.
