Quthbullapur:10 నిమిషాలు గందర గోళం సృష్టించి చెప్పుతో దాడి చేసినట్టు సమాచారం వచ్చింది.
ఏకంగా పనిచేస్తున్న కార్యాలయానికి వచ్చి దాడి చేశారు.
Quthbullapur:గాజుల రామారం సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేసే అధికారి అని పుకార్లు….
తనను మోసం చేశావని అతను పనిచేస్తున్న చోటకే వచ్చి అతను పనిచేస్తున్న కార్యాలయంలోనే ఆ అధికారిని చెప్పుతో కొట్టిందని పుకార్తు శికార్లు చేస్తున్నాయి. తెలిసిన వివరాలలోకి వెళితే…… నిత్యం కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయ భవనంలోని మొదటి అంతస్తులో ఉండే గాజులరామారం సర్కిల్ పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగంలో పనిచేస్తున్న ఓ టౌన్ ప్లానింగ్ అధికారిని ఓ మహిళ చెప్పు తో కొట్టిందన్న వార్త ఒక్కసారిగా అందరిని నివ్వెర పరిచింది.
శుక్రవారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటలకు ఓ మహిళ గాజులరామారం పట్టణ ప్రణాళిక విభాగానికి వచ్చి సెక్షన్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఆ అధికారిని ఉద్దేశించి తనను సదరు అధికారి మోసం చేశాడని గొడవపడి సుమారు 10 నిమిషాల పాటు గందరగోళాన్ని సృష్టించిందని సమాచారం. అంతేకాకుండా సదరు మహిళా చెప్పుతో కొట్టి నానా రభస చేసిందని సమాచారం.
అనంతరం ఆ మహిళను బతిమాలుకుని నీకు దండ పెడతా కాళ్లు పట్టుకుంటా. బయట కు పోయి మాట్లాడుకుందామని తన మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని బయటికి తీసుకువెళ్లాడని సమాచారం కూడా చక్కర్లు కొడుతుంది. ఇదే విషయంపై మొదటి అంతస్తులో ఉన్న పట్టణ ప్రణాళిక, రెవెన్యూ విభాగాల అధికారులను, సిబ్బందిని అడిగిన తామేమి చూడలేదని తమకేమీ తెలియదని చెప్పడం అనుమానాలకు తావిస్తుంది.
.
వదంతులా….వాస్తవమా….?
మహిళ ఆ విభాగం ఎల్లప్పుడూ నిర్మాణ అనుమతులు, నిర్మాణ సంబంధిత ఇతరత్రా వ్యవహారాల కోసం వచ్చే ప్రజలు, సిబ్బందితో హడావిడిగా ఉంటుంది. అయితే మధ ఈ మొదటి అంతస్తులు పట్టణ ప్రణాళిక విభాగంతో పాటు రెవెన్యూ విభాగం కూడా ఉంది అది కూడా ఎల్లప్పుడూ వినియోగదారులు, అధికారులు, సిబ్బందితో బిజీ బిజీగా ఉంటుంది. దీంతో అక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో కార్యాలయం అంతా విస్తరిస్తుంది. కానీ శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఓ సంఘటన ఎవరు చూడలేదు అనడం.ఎవరికీ తెలియదు అనడం విడ్డూరంగా ఉంది.తమ కేమీ తెలియదని చెప్పడం అనుమానాలకు తావిస్తుంది.
పనిచేయని సీసీ కెమెరాలు:
కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. కేవలం ఒక్క డిప్యూటి కమీషనర్ గదిలో మాత్రమే పనిచేస్తుంది. మిగతా ఎక్కడ కూడా కార్యాలయంలో పనిచేయడం లేదు. దీంతో ఇంత జరిగినా విషయం పొక్కడం లేదు. కార్యాలయం సిబ్బంది కూడా విషయాన్ని దాస్తున్నారని సమాచారం. సీసీ కెమెరాలు పనిచేస్తే శుక్రవారం జరిగిన విషయం బహిర్గతమయ్యేది.
అక్రమ సంభందమే కారణమా…..?
టౌన్ ప్లానింగ్ అధికారి పై మహిళ చెప్పుతో దాడి చేసిందన్న వ్యవహరంలో అక్రమ సంభందమే కారణమని సమాచారం. అక్రమ సంభందం పెట్టుకుని గత కొన్ని రోజులుగా పట్టించుకోవడం లేదని ,సదరు అధికారి మహిళకు ఉన్న అక్రమ సంభందం విషయంలో సదరు మహిళ సంసారం కూడా చెడిందని ,ఇప్పుడు నువ్వు కూడా మోసం చేశావని సదరు మహిళ ఆ అధికారిని కొట్టిందని సమాచారం.సదరు అధికారి ప్రభుత్వు ఉద్యోగ నియమ నిభందలనకు వ్యతిరేకంగా అక్రమ సంభందం పెట్టుకున్నట్లు తేలితే సదరు టౌన్ ప్లానింగ్ అధికారి పై ఉన్నతాదికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.