Quthbullapur:ఎమ్మెల్యే కేపీని ఘాటుగా విమర్శించిన కూన శ్రీశైలం గౌడ్…
Quthbullapur:టిడిపిలో గెలిచి టిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన వివేకానందకు ముఖ్యమంత్రి విమర్శించే అర్హత లేదని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీల మధ్యలో రజక విభేదాలు గు ప్పమన్నాయి.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ మంగళవారం ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోబోమని ఆయన ప్రజల కోసం పరిశీలించే నాయకుడని అన్నారు వివేకానందును గల్లీలో కూడా తిరగనియ్యబోమని హెచ్చరించారు. ఇంకొక మాట మాట్లాడితే బాగుండదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంకొక మాట అన్న గుర్తించి కొడతామని హెచ్చరించారు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని వివేకానందును హెచ్చరించారు.
రాష్ట్రంలో తనపై దాడి చేసిన వివేకానంద రాష్ట్రంలో శాంతి పద్ధతులపై మాట్లాడడం ఆస్యాస్పదంగా ఉందని అన్నారు. దీనికి ప్రతిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా దీటుగా స్పందించారన్నారు.
కూన శ్రీశైలం గౌడ్ ఊసరవెల్లి లాంటివాడని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారిపోయే ఊసరవెల్లి అని ఘాటుగా విమర్శించారు మా ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ 6000కోట్లతో కుత్బుల్లాపూర్ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడని నువ్వు నువ్వు ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని దోచుకున్నావని విమర్శించారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ను ఒక్క మాట అన్న ఇంట్లో నుంచి బయట కూడా కాలు పెట్టలేవని హెచ్చరించారు ఇరు వర్గాల పార్టీ నాయకులు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.